తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీపై దాడికి ఉగ్రకుట్ర'.. దేశవ్యాప్తంగా NIA సోదాలు.. పీఎఫ్ఐ కార్యకర్తలే టార్గెట్ - nia pfi kerala police

NIA Raids : అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. కర్ణాటక, కేరళ, బిహార్‌లోని దాదాపు 25 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం దాడులు నిర్వహించింది.

Prime Minister Modi case.. NIA raids at 25 places in karnataka kerala bihar states
'మోదీపై దాడికి ఉగ్రకుట్ర'.. దేశవ్యాప్తంగా NIA సోదాలు.. పీఎఫ్ఐ కార్యకర్తలే టార్గెట్

By

Published : May 31, 2023, 10:00 AM IST

Updated : May 31, 2023, 11:24 AM IST

NIA Raids Kerala :నిషేధిత ఇస్లామిక్​ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తలే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా ఆకస్మిక సోదాలు చేపట్టింది. 2022లో బిహార్​లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి యత్నించిన కేసు సహా ఇతర కేసులకు సంబంధించి కర్ణాటక, కేరళ, బిహార్‌లోని దాదాపు 25 ప్రాంతాల్లో బుధవారం దాడులు నిర్వహించింది.

NIA Raids Dhakshina Kannada : బుధవారం ఉదయం నుంచే.. దక్షిణ కన్నడ జిల్లాలో సోదాలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 16 ప్రదేశాల్లో పీఎఫ్ఐ కార్యకర్తలకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్పత్రులపై దాడులు చేస్తున్నట్లు వెల్లడించాయి. మంగళూరు, పుత్తూరు, బెల్తాంగడి, ఉప్పినాంగడి, వెనూర్​ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పలు డిజిటల్‌ డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ అధికారులకు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

NIA Raids Today :
ఇదివరకే ఈ కేసులో బంట్వాళ్​, పుత్తూరులో ఎన్​ఐఏ సోదాలు జరిపింది. నిందితులుగా ఉన్న మహ్మద్ సినాన్, సర్ఫరాజ్ నవాజ్, ఇక్బాల్, అబ్దుల్ రఫీక్‌లను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు.

PFI NIA Arrest : పట్నా​లో కూడా గతేడాది జూలై 12న పీఎఫ్​ఐపై నమోదైన కేసులో ఆరుగురిని అరెస్టు చేసిన ఎన్​ఐఏ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4-5 తేదీల్లో బిహార్‌ మోతిహరిలోని ఉగ్రసంస్థకు సంబంధించిన ఎనిమిది ప్రదేశాల్లో దర్యాప్తు బృందం దాడులు చేసింది. ఈ క్రమంలో పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేసింది.

NIA Raids Bihar : కాగా, కొద్ది రోజుల క్రితం పీఎఫ్​ఐ శిక్షకుడు యాకుబ్..​ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ఫేస్​బుక్​లో ఓ వీడియోను పోస్ట్​ చేశారు. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న యాకుబ్​ ప్రస్తుతం పరారీలో ఉండగా ఇద్దరిని అరెస్ట్​ చేసింది ఎన్​ఐఏ. మిగతావారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

What Is PFI Case : గల్ఫ్ దేశాల నుంచి హవాలా సొమ్మును తరలించి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్న ఆరోపణలపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. దక్షిణ భారతదేశంలోని పీఎఫ్‌ఐ హవాలా మనీ నెట్‌వర్క్​.. దేశంలో ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తోంది. ఫుల్వారీషరీఫ్​ సహా ఇతర కేసులకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు బృందం ఈ సోదాలు చేస్తోంది.

Last Updated : May 31, 2023, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details