కర్ణాటక చిక్కమగళూరు నగరంలోని కోదండరామస్వామి దేవాలయంలో ఎటు చూసినా కన్నడమయమే. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యానికి ఈ ప్రదేశం నెలవు. అక్కడ చేసే పూజలు, వ్రతాల దగ్గరినుంచి గోడలకు ఉన్న శ్లోకాలు, ఆలయ విశేషాలు ఇలా అన్నీ కన్నడ భాషలోనే కనిపిస్తాయి. ఈ ఆలయంలో జరిగే పెళ్లిళ్లు సైతం కన్నడలోనే నిర్వహిస్తారు. దీనికి కారణం ఆ ఆలయ పూజారి కణ్నన్.. ఆయన వంశీకులు.
ఆ గుడిలో ఎటు చూసినా.. 'కన్నడ' మయమే - temple priests performing puja in kannada
సాధారణంగా ఏ గుడిలోనైనా మంత్రాలు సంస్కృతంలో పఠిస్తారు. కానీ కర్ణాటకలోని ఓ కోవెలలో మాత్రం అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అన్నీ కన్నడ భాషలోనే జరుపుతున్నారు ఆలయ అర్చకులు. భావితరాలకు తమ మాతృభాష గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇలా వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు.

ఆ గుడిలో ఎటు చూసినా 'కన్నడ' మయమే
ఆ గుడిలో ఎటు చూసినా.. 'కన్నడ' మయమే
కారణం ఇదే..
కణ్నన్తండ్రి నలభైఏళ్ల క్రితం హిరెమగళూరు ప్రాంతంలోని కోదండరామస్వామి దేవాలయానికి వచ్చి కన్నడలోనే పూజలు నిర్వహించేవారు. తరువాత తండ్రి బాటలోనే కన్నడలో పూజలు చేస్తున్నారు కణ్నన్. 'ఇప్పడున్న యువతకు కన్నడ భాష ప్రాముఖ్యత గురించి తెలియదు. వారికి అవగాహన కల్పించేందుకు తన వంతు ఇలా చేస్తున్నాన'ని కణ్నన్ తెలిపారు. తన దగ్గరకు వచ్చిన విదేశీ విద్యార్థులకు సంస్కృతంలో బోధిస్తారు. కానీ ఆలయ పూజలు మాత్రం కన్నడలోనే చేస్తారు.