Price Rise in India: దేశంలో ధరల పెరుగుదలపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్రం ఈ ఏడాదిలోనే రూ.1.25 లక్షల కోట్ల అదనపు పన్నుల భారం మోపిందని ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. పెరుగుతున్న ధరలతో ప్రజల జీవనోపాధి అతిపెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. 'ఎన్నికల్లో గెలుపు దోపిడీకి లైసెన్స్'లాగా మారిందని ఆరోపించారు. ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.
"ధరల పెరుగుదల ప్రతి ఇంటి బడ్జెట్ను చిన్నాభిన్నం చేస్తోంది. సామాన్యుడి జీవనోపాధిపై ప్రభావం పడుతోంది. పెట్రోల్ రేట్లు ప్రతి రోజు గుడ్మార్నింగ్ బహుమతిలా మారింది. గత 12 రోజుల్లో 10సార్లు పెరిగాయి."
-రణదీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి