తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీవ్​లో అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి శంకుస్థాపన - Diu administration

దీవ్​లోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. దమణ్​ దీవ్​, దాద్రానగర్ హవేలీలో నాలుగు రోజుల పర్యటిస్తున్న ఆయన.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి స్థానిక పాలనా యంత్రాంగం చేస్తున్న కృషిని కొనియాడారు.

Prez launches development projects in Diu, praises local administration
దీవ్​లో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన

By

Published : Dec 26, 2020, 8:12 PM IST

దమణ్​ దీవ్​, దాద్రానగర్ హవేలీలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా దీవ్​లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి దీవ్​ పాలనా యంత్రాంగం చేసిన కృషిని, పరిశుభ్రతను కాపాడుకోవడానికి చేపట్టిన కార్యక్రమాలను కోవింద్​ ప్రశంసించారు.

పాలనా యంత్రాంగంపై ప్రశంసల జల్లు

ఈ కార్యక్రమంలో మాట్లాడిన కోవింద్​.. ఆపరేషన్​ విజయ్​ ద్వారా 1961లో పోర్చుగల్​ నుంచి ఈ దీవులను పొందామని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందన్నారు. 2019లో స్వచ్ఛ సర్వేక్షణ్​ సర్వేలో తొలి స్థానాన్ని దక్కించుకుందని గుర్తు చేసుకున్నారు. 100శాతం సౌర విద్యుత్​ను వినియోగించుకుంటున్న నగరంగా దీవ్​ను తీర్చిదిద్దిన అధికారులను కొనియాడారు. చారిత్రక, సాంస్కృతి వారసత్వ ప్రదేశాలను పరిరక్షించి, అందంగా తయారు చేశారన్నారు. దీవ్​లో ఏర్పాటు చేసిన విద్యా కేంద్రంపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో వోకల్​ ఫర్​ లోకల్​, ఆత్మనిర్భర్​ భారత్​ వేగంగా ముందుకు వెళ్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు.


ఇదీ చూడండి:
ఆ భవనాలు కూల్చి ఎంపీ కార్యాలయాల నిర్మా
ణం

ABOUT THE AUTHOR

...view details