దేశ ప్రజలకు, విదేశాల్లో ఉన్న భారతీయులందరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. పండుగను జరుపుకోవాలని సూచించారు.
కొవిడ్ 19పై పోరాటంలో భాగంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని.. అందరికి సుఖ సంతోషాలు, శాంతి చేకూరాలని గణేషుడిని ప్రార్థించాలని రాష్ట్రపతి ప్రజలకు పిలుపునిచ్చారు.