అవినీతిపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (Modi news) పునరుద్ఘాటించారు. గత 6-7 సంవత్సరాలుగా తీసుకున్న చర్యల ఫలితంగా.. దేశంలో అవినీతికి తావులేదని నిరూపించినట్లు పేర్కొన్నారు. అవినీతిపరులు తప్పించుకోలేరని ఇప్పుడు దేశం నమ్ముతోందని అభిప్రాయపడ్డారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సంయుక్త సమావేశానికి గుజరాత్ నుంచి వర్చువల్గా హాజరైన మోదీ(Modi news) ఈ వ్యాఖ్యలు చేశారు.
''చిన్నదైనా, పెద్దదైనా అవినీతి అంటే మరొకరి హక్కుల్ని హరించడమే. ఇది సమాజంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుంది. జాతి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ప్రజల నుంచి దోచుకొని, దేశాన్ని మోసం చేసే వారు ఎంత బలవంతులైనా.. తాము కనికరం చూపించబోమని దేశం నమ్ముతోంది. ప్రభుత్వం ఇలాంటివారిని అసలు విడిచిపెట్టదు.''