తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'త్యాగం, కరుణ, సత్యానికి ప్రతిరూపం ఏసుక్రీస్తు' - రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఈస్టర్ పండగ శుభాకాంక్షలు

ఈస్టర్​ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. క్షమ, త్యాగానికి ఏసుక్రీస్తు ప్రతిరూపమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కొనియాడారు.

easter greetings
'త్యాగం, కరుణ, సత్యానికి ప్రతిరూపం ఏసుక్రీస్తు'

By

Published : Apr 4, 2021, 8:42 AM IST

ఈస్టర్​ పండుగ సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు పునరుత్థానం జ్ఞాపకార్థం ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందంతో జరుపుకొంటారని పేర్కొన్నారు. మానవత్వం, క్షమ, త్యాగం, కరుణ, సత్యానికి ఏసుక్రీస్తు ప్రతిరూపమని కొనియాడారు. ఏసు జీవితం మనకు శాంతి, ప్రేమ, సోదరభావం నేర్పుతుందన్నారు.

"దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవులకు ఈస్టర్​ పండుగ శుభాకాంక్షలు. ఈ ఆనందకరమైన సందర్భంలో, ప్రేమ, ఆప్యాయత, ఆనందం, శ్రేయస్సు, సమాజంలో సామరస్యాన్ని పెంపొందించే విలువలను పాటిద్దాం."

-రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

'ప్రేమ, దయతోనే మోక్షం'

క్రైస్తవ సోదరులు ఆదివారం ఈస్టర్​ పండుగ చేసుకోనున్న నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. మనుషులందరి పట్ల దయతో మెలగుతూ పండుగ చేసుకోవాలని చెప్పారు. ప్రేమ, శాంతి, దయ, క్షమాగుణంతో ఏసుక్రీస్తు మానవులకు మోక్ష మార్గాన్ని చూపారని పేర్కొన్నారు.

"ఇతరుల పట్ల కరుణతో వ్యవహరించడం ద్వారా ఈస్టర్​ చేసుకుందాం. ఈ పండుగ మన జీవితాల్లో శాంతి, సామరస్యం, ఆరోగ్యం తీసుకురావాలి." అని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

'ఏసు బోధనలను గుర్తు చేసుకోవాలి'

ఈస్టర్​ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ట్విట్టర్​ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. "ఈ రోజున, ఏసుక్రీస్తు ధర్మబద్ధమైన బోధనలను మనం గుర్తు చేసుకోవాలి. సామాజిక సాధికారత గురించి క్రీస్తు చెప్పిన బోధనలు.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం" అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:తెలుగు ప్రాచీన హోదాను కాపాడుకుందాం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details