తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా నిబంధనలు గాలికి.. సభలో మాస్క్ లేకుండానే ఎంపీలు! - MPs violate covid norms in buget session

President Speech in Parliament: రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సమావేశంలో ఎంపీలు కరోనా నిబంధనలు పాటించలేదు. ఒక్కో సీటులో ఏడుగురు కూర్చొని, మాస్కు లేకుండానే ఒకరితో మరొకరు ముచ్చటించారు.

President Speech in Parliament
బడ్జెట్ సెషన్

By

Published : Jan 31, 2022, 1:01 PM IST

Updated : Jan 31, 2022, 3:58 PM IST

కరోనా నిబంధనలను గాలికి వదిలేసిన ఎంపీలు

President Speech in Parliament: బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగించారు. అయితే.. ఈ సమయంలో ఎంపీలు చాలా మంది కరోనా నిబంధనలను పాటించలేదు.

సెంట్రల్​ హాల్​లో మొదటి రెండు వరుసల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, ప్రముఖ కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ప్రముఖ నాయకులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చున్నారు. కానీ మిగిలిన వరుసలలో ఎక్కడా.. భౌతిక దూరం కనిపించలేదు.

Covid Norms Violation in Parliament: సెంట్రల్ హాల్​ మూడో వరుస నుంచి పలువురు కేంద్ర మంత్రులు సహా ఎంపీలెవరూ కరోనా నిబంధనలు పాటించలేదు. కొన్ని వరుసల్లో ఒక్కో సీటుకు ఏడుగురు కూర్చున్నారు. కొందరు ఎంపీలు మాస్కులు కూడా లేకుండా ఇతరులతో ముచ్చటించారు.

కరోనా మూడో దశ వేళ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందుకోసం పార్లమెంట్ సెంట్రల్​ హాల్​, లోక్​ సభ, రాజ్య సభ ఛాంబర్​లో ఎంపీలు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. సమావేశాలు ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం రాజ్య సభలో, సాయంత్రం లోక్​సభలో నిర్వహిస్తారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:'వ్యాక్సినేషన్​తో దేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచవ్యాప్తం'

Last Updated : Jan 31, 2022, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details