దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయమని పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ప్రజల శ్రేయస్సు కోసం చర్చించి, సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉన్న ఏకైక వేదిక అని చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతీయులకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కొవిడ్ సమస్యలు ఇంకా పూర్తిగా సమసిపోలేదని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. వ్యాపారులు, వలసదారులపై కరోనా ప్రభావం పడిందని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల ప్రభావితమైన రంగాల ఊతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
"లాక్‌డౌన్ వల్ల ప్రభావితమైన రంగాల ఊతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా విపత్తు వేళ కూడా సాగు రంగంలో వృద్ధి చెందింది. కరోనాను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు."