తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై భారత్​ అసాధారణ పోరాటం: రాష్ట్రపతి కోవింద్​ - president ramnath kovind republic day speech

President Ramnath Kovind: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఐక్యత, ఒకే దేశం అనే స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏటా గణతంత్ర దినోత్సవం జరుపుకొంటామని, కరోనా కారణంగా ఈ సారి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నప్పటికీ.. స్ఫూర్తి మాత్రం ఎప్పటిలాగే దృఢంగా ఉందని పేర్కొన్నారు.

president ramnath kovind
రామ్​నాథ్ కోవింద్ ప్రసంగం

By

Published : Jan 25, 2022, 7:29 PM IST

President Ramnath Kovind: బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా పై పోరులో దేశం అసాధారణ ప్రతిభ చూపుతోందన్నారు.

మన ప్రజాస్వామ్య వైవిధ్యం, చైతన్యం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఐక్యత, ఒకే దేశం అనే స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏటా గణతంత్ర దినోత్సవం జరుపుకొంటాం. మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నప్పటికీ.. స్ఫూర్తి మాత్రం ఎప్పటిలాగే దృఢంగా ఉంది. ఈ సందర్భంగా స్వరాజ్యం కల సాధనలో సాటిలేని ధైర్యాన్ని ప్రదర్శించి, దాని కోసం పోరాడేందుకు ప్రజలను మేల్కొలిపిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుందాం. రెండేళ్లయినా కరోనాతో పోరాటం ఇంకా అంతం కాలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదృశ్య శక్తితో పోరాటంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. వైరస్​పై పోరులో దేశం అసాధారణ ప్రతిభ చూపుతోంది. ఇతర దేశాలకు కూడా భారత్‌ సాయం చేసింది. కరోనాకు రెండు టీకాలు రూపొందించడం దేశానికి గర్వకారణం. మన దేశంలో తయారైన టీకాలను ఇతర దేశాలకూ అందించాం. కఠిన సమయంలోనూ దేశ ప్రజలు పోరాటస్ఫూర్తి చాటారు. కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. కరోనా సమయంలోనూ సాగు, తయారీ రంగంలో ప్రగతి సాధించాం. యువ మానవ వనరులు మన దేశానికి అనుకూలమైన అంశం. మన యువత స్టార్టప్‌లతో అద్భుతాలు సృష్టిస్తోంది. మన యువకుల విజయగాథలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. మన యువకుల విజయగాథలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి

ABOUT THE AUTHOR

...view details