దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ టీకా తీసుకున్నారు. దిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో రాష్ట్రపతి తొలి వ్యాక్సిన్ డోసు వేయించుకున్నారు.
కొవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. తిరువనంతపురంలోని తైకాడ్ వ్యాక్సిన్ కేంద్రంలో టీకా తొలి డోసు తీసుకున్నారు.
టీకా తీసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ సాంక్వెలిమ్‌లోని ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకా వేయించుకున్నారు.
టీకా తీసుకున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఆయన భార్య లక్ష్మీ పూరీలు.. దిల్లీ కౌశాంబీలోని యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కొవిడ్-19 టీకా తొలి డోసు తీసుకున్నారు.
కొవిడ్ టీకా తీసుకున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ భార్య లక్ష్మీ పూరీ మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఓ వ్యాక్సిన్ కేంద్రం వద్ద టీకా తీసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. భౌతిక దూరం పాటించడానికి లేకుండా పెద్ద ఎత్తున ప్రజలను వేచి చూసేలా చేస్తున్నారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ కేంద్రం బయట బారులు తీరిన ప్రజలు ఇప్పటికే ప్రధాని, ఉప రాష్ట్రపతి సహా పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు. 60ఏళ్లు దాటిన వారికి, కేంద్రం ప్రకటించిన వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్లు పైబడిన వారికి రెండో విడతలో టీకా వేస్తున్నారు.