తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Padma awards 2021: పద్మవిభూషణుడు ఎస్పీ బాలు.. పాసవాన్​కు పద్మభూషణ్​ - Padma bhushan 2021

2021 ఏడాదికి సంబంధించి పద్మ అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్​ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం అందజేసింది. లోక్​సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్​జన్​ శక్తి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత రాం విలాస్​ పాసవాన్​కు పద్మభూషణ్​ దక్కింది.

PADMA AWARDS 2021
PADMA AWARDS 2021

By

Published : Nov 9, 2021, 11:52 AM IST

Updated : Nov 10, 2021, 7:57 AM IST

2021 ఏడాదికి గానూ పద్మ పురస్కారాలను (Padma awards 2021) ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో పద్మ అవార్డు గ్రహీతలకు.. పురస్కారాలు (Padma awards 2021) అందించారు.

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం ప్రకటించిన దేశంలోనే రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్​ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం అందజేసింది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్​ అవార్డును స్వీకరించారు.

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ సాహూ.. పద్మవిభూషణ్ (Padma vibhushan 2021) పురస్కారాన్ని అందుకున్నారు. లోక్​సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్​ పద్మభూషణ్ (Padma bhushan 2021) అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు.

సుదర్శన్ సాహూ
సుమిత్రా మహాజన్

అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయి తరపున ఆయన భార్య పద్మభూషణ్​ స్వీకరించారు. లోక్​జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత రాంవిలాస్ పాసవాన్​ తరపున ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్.. పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.

అవార్డు స్వీకరిస్తున్న తరుణ్ గొగొయి భార్య
చిరాగ్ పాసవాన్

మొత్తం 119...

2021 సంవత్సరానికి 199 మందికి పద్మ అవార్డులు లభించాయి. ఏడుగురికి పద్మవిభూషణ్​, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి మరణానంతరం అవార్డు వరించింది. ఒక ట్రాన్స్​జెండర్​కు అవార్డుకు ఎంపికయ్యారు.

ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జపాన్ మాజీ ప్రధాని షింజో అబెలను పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం.

కరోనాతో ఆలస్యం..

2020 ఏడాదికి సంబంధించిన అవార్డులను సోమవారం ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. కరోనా కారణంగా 2020లో ప్రదానోత్సవం నిర్వహించలేకపోయారు.

ఇదీ చదవండి:పద్మ అవార్డుల ప్రదానోత్సవం- మోదీ సహా ప్రముఖులు హాజరు

Last Updated : Nov 10, 2021, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details