భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రైలు ప్రయాణం చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని స్వస్థలానికి దిల్లీ సఫ్దర్‌జంగ్ నుంచి ప్రత్యేక రైలులో సతీసమేతంగా బయలుదేరారు. గత 15 ఏళ్లలో ఓ రాష్ట్రపతి రైలు ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వో బోర్డు ఛైర్మన్, సీఈఓ సునీత్ శర్మ.. రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికారు.
రాష్ట్రపతి.. తొలుత యూపీలోని కాన్పుర్, లఖ్‌నవూ వెళ్తారు. ఆ తర్వాత జిన్జాక్, రురా గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పాత మిత్రులు, పాఠశాల స్నేహితులను ఆయన కలవనున్నారు.