మూడు రోజుల పర్యటన నిమిత్తం.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా మొదట కాశీలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సమేతంగా కాశీకి చేరుకుని గంగా నది ఒడ్డున పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్థానిక విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకుంటారు.
ఈ పర్యటనలో కోవింద్.. వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇది రాష్ట్రపతి వ్యక్తిగత పర్యటన కావడం గమనార్హం.