తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి కోవింద్ - రాష్ట్రపతి భవన్

రామ్​నాథ్​ కోవింద్​ ఆరోగ్యంపై రాష్ట్రపతి భవన్​ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. స్వల్ప అస్వస్థతతో దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కోవింద్​కు గత నెల 30న బైపాస్ సర్జరీ జరిగింది.

President Kovind was shifted from ICU to a special room in AIIMS today
ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి రాష్ట్రపతి

By

Published : Apr 3, 2021, 12:16 PM IST

ఇటీవలే బైపాస్​ సర్జరీ చేయించుకున్న రామ్​నాథ్​ కోవింద్​ ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్రపతి భవన్​ తెలిపింది. దిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయనను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించినట్లు వెల్లడించింది.

విశ్రాంతి..

వైద్యుల పర్యవేక్షణలో రాష్ట్రపతి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, వారి సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. గుండె సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో కోవింద్​కు గత నెల 30న శస్త్రచికిత్స నిర్వహించారు.

ఇవీ చదవండి:నిలకడగా రాష్ట్రపతి ఆరోగ్యం-30న శస్త్రచికిత్స

దిల్లీ ఎయిమ్స్​కు రాష్ట్రపతి కోవింద్!

ABOUT THE AUTHOR

...view details