భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గురువారం ఉదయం కంటి ఆపరేషన్ (క్యాటరాక్ట్ సర్జరీ) జరిగింది. ఈ మేరకు శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదలచేసింది.
"దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కంటికి శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ విజయవంతం కాగా ఆయనను డిశ్చార్జ్ చేశారు" అని ప్రకటనలో తెలిపింది.