తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు.. ద్రౌపదీ ముర్ము ప్రస్థానం - draupadi murmu president of india

DRAUPADI MURMU BIOGRAPHY: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయ కేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించారు. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర లిఖించారు. మంత్రి, గవర్నర్​గా ఉన్నత సేవలు అందించిన ఆమె తదుపరి రాష్ట్రపతిగా సేవలు అందించనున్నారు.

Draupadi Murmu Profile
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

By

Published : Jul 21, 2022, 8:14 PM IST

Updated : Jul 21, 2022, 8:21 PM IST

DRAUPADI MURMU BIOGRAPHY: ఒడిశాకు చెందిన ఆదివాసీ మహిళా నేతగా ఉన్న 64 ఏళ్ల ద్రౌపదీ ముర్ము రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర లిఖించారు. వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొంది అందరి మన్ననలు అందుకున్న ద్రౌపదీ.. తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా విశేష సేవలందించారు. నాలుగేళ్ల వ్యవధిలో భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయినా ఆ బాధను దిగమింగుకుని ప్రజాసేవకు అంకితమయ్యారు.

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​తో ద్రౌపదీ ముర్ము

ద్రౌపది ముర్ము ప్రస్థానం:

  • ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో గ్రామంలో 1958 జూన్‌ 20న సంతాలి గిరిజన కుటుంబంలో ద్రౌపదీ ముర్ము జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్‌ తుడు. ఆమె తండ్రి, తాత ఇద్దరూ గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు.
  • draupadi murmu education: మొదట టీచర్‌గా పనిచేసిన ద్రౌపదీ ముర్ము 1997లో భారతీయ జనతా పార్టీలో చేరి రాయరంగపూర్ నగర్ పంచాయితీ కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాయ్‌రంగపూర్‌ నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.
  • రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
  • భాజపా- బిజూ జనతాదళ్‌ కలిసి ఏర్పాటు చేసిన నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 మధ్య మంత్రిగా పనిచేశారు.
  • 2010, 2013లో మయూర్‌భంజ్‌ భాజపా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో భాజపా ఎస్టీ మోర్చా జాతీయ కార్య నిర్వాహక సభ్యురాలిగా ఉన్నారు.
  • draupadi murmu governor: 2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా సేవలందించారు.
    ఒడిశా సైకత శిల్పి తీర్చిదిద్దిన సైకత శిల్పం

ముర్ము వ్యక్తిగత ప్రస్థానం:

  • రాజకీయంగా ఉజ్వల జ్యోతిలా వెలుగుతున్నప్పటికీ ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. అవన్నీ తట్టుకొని నిలబడి ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
  • అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆమె 25 ఏళ్ల కెరీర్‌లో రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్‌ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ఎదిగారు.
  • draupadi murmu family: ద్రౌపదీ ముర్ము భర్త పేరు శ్యామ్‌చరణ్ ముర్ము. 2014లో ఆయన మరణించారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. భర్త, తన ఇద్దరు కుమారులను నాలుగేళ్ల వ్యవధిలో కోల్పోవడం ద్రౌపదీ ముర్ము జీవితంలో విషాదాన్ని నింపింది.ఆ బాధను దిగమింగుకుని ఆమె ప్రజా సేవకు అంకితమయ్యారు.
  • వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందిన ద్రౌపదీ ముర్ము అందరి మన్ననలు అందుకున్నారు. గతంలో ప్రతిభాపాటిల్ రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. ఆ తర్వాత మళ్లీ ఆ పదవి ఓ ఆదివాసీ మహిళకు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    ప్రధాని మోదీతో ద్రౌపదీ ముర్ము
  • draupadi murmu cast: ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజనులకు దక్కలేదు. ఆ లోటును ద్రౌపదీ ముర్ము భర్తీ చేశారు. ముర్ము విశేష ప్రతిభాశాలి. మంత్రిగా, గవర్నర్‌గా ఆమె మెరుగైన సేవలు అందించారు.
  • ద్రౌపదీ ముర్ము ఎదుగుదల భారత ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పాఠానికి, స్ఫూర్తికి నిదర్శనం. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు.

ఇవీ చదవండి:ఈడీ విచారణకు సోనియా.. తోడుగా ప్రియాంక.. దేశవ్యాప్తంగా నిరసనలు

యోగి కేబినెట్‌లో కలకలం.. మంత్రి రాజీనామా.. మరొకరు దిల్లీకి..

Last Updated : Jul 21, 2022, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details