తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబులెన్స్​లో మంటలు- గర్భిణీ సజీవదహనం - మంటల్లో సజీవదహనమైన గర్భిణి

గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఓ విషాద ఘటన జరిగింది. అంబులెన్స్​ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో అంబులెన్స్​లో మంటలు చెలరేగి మహిళ సజీవదహనమయ్యారు. ఈ ఘటన యూపీలో జరిగింది.

ambulance caught fire
అంబులెన్స్​లో మంటలు, గర్భిణి మృతి

By

Published : May 2, 2021, 10:39 AM IST

అంబులెన్స్ ప్రమాదానికి గురికాగా... ఓ గర్భిణీ సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సీతాపుర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు.. మహ్ముదాబాద్-గొడచ్చ ప్రాంతం నుంచి వెళ్తున్న క్రమంలో అంబులెన్స్​ అదుపు తప్పింది. చెట్టును ఢీకొట్టిన ఆ అంబులెన్స్​ నుంచి మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న గర్భిణీ మృతిచెందగా.. ఇద్దరు అంబులెన్స్​ సిబ్బంది, డ్రైవర్​ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

అదుపు తప్పిన అంబులెన్స్

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపు చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. గర్భిణీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:'కరోనా యోధులపై పని భారం తగ్గించేదెలా?'

ABOUT THE AUTHOR

...view details