తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అర్ధరాతి పురిటి నొప్పులు.. 8కి.మీ ఆమెను మోసుకుంటూ ఆస్పత్రికి... - మలై మహదేశ్వర అటవీ ప్రాంతం

సరైన రోడ్డు లేక ఓ గర్భిణీని డోలీ కట్టి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన కర్ణాటకలో జరిగింది. 8 కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతంలో గర్భిణీని మోసుకెళ్లారు.

pregnant woman palanquin
గర్భిణీని డోలీ కట్టి మోసుకెళ్లిన గ్రామస్థులు

By

Published : Jul 1, 2022, 2:59 PM IST

గర్భిణీని డోలి కట్టి భుజాలపై మోసుకుళ్లిన ఘటన కర్ణాటకలోని చామరాజనగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది. డోలిపైనే 8 కిలోమీటర్లు గర్భిణీ ఉంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రయాణం మొదలు పెట్టి ఉదయం ఆరు గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు.

గర్భిణీని డోలి కట్టి మోసుకెళ్లిన గ్రామస్థులు

అసలేం జరిగిందంటే: చామరాజనగర్​లోని మలై మహదేశ్వర అటవీ ప్రాంతంలోని దొద్వాణి గ్రామానికి చెందిన శాంతలకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవం గడువు కంటే ముందే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో ఎవరికీ వాహనాలు లేవు. ఏం చేయాలో అర్థంకాని కుటుంబ సభ్యులు.. గ్రామస్థుల సాయంతో డోలీ కట్టారు. అందులోనే శాంతలను మోసుకెళ్లారు. పులులు, అడవి పందులు, చిరుతలు వంటి జంతువులు ఆ అరణ్యంలో ఎక్కువగా ఉంటాయి. వాటిని సైతం లెక్కచేయకుండా అర్ధరాత్రి ప్రయాణాన్ని కొనసాగించారు. వైద్యులు.. శాంతలకు సురక్షిత ప్రసవం చేశారు.

'జన-మన' అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ప్రారంభించింది. అటవీ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కనీసం 8 నుంచి 10 కి.మీ దూరం నడిచే గ్రామస్థులు ఉపయోగించుకునేందుకు 5 జీపులను అందుబాటులో ఉంచింది. అయితే సిగ్నల్‌ సరిగ్గా లేని కారణంగా గిరిజనులు ఫోన్​ చేయలేకపోతున్నారని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:యువతుల మధ్య లవ్​.. పెళ్లైందని తెలిసి చితకబాదిన బంధువులు

సీపీఎం కార్యాలయంపై బాంబు దాడి.. పోలీసులు హైఅలర్ట్​

ABOUT THE AUTHOR

...view details