Pregnant goat raped: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు.. మూగజీవినీ వదల్లేదు. గర్భంతో ఉన్న మేకపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అతి కిరాతకంగా దానిని చంపేశారు. కేరళ కాసరగోడ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
గర్భంతో ఉన్న 'మేక'పై గ్యాంగ్ రేప్, హత్య - మేకపై అమానుషం
Pregnant goat raped: గర్భంతో ఉన్న మేకపై అత్యాచారానికి పాల్పడి, చంపేసిన ఘటన కేరళ కాసరగోడ్‌లో జరిగింది. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
క్రూరత్వానికి పరాకాష్ట:కాసరగోడ్ జిల్లా కనహాగడ్లో మొయిదీన్ కుంజూ అనే వ్యక్తికి ఓ రెస్టారెంట్ ఉంది. మంగళవారం కార్మిక సంఘాల సమ్మె కారణంగా సెలవు ఇచ్చారు. కుంజూకు చెందిన మేకను ఆ సమయంలో రెస్టారెంట్ వెనుక కట్టేసి ఉంచారు. అదే రోజు రాత్రి కుంజూకు మేక అరుస్తున్న శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే.. మరో రెస్టారెంట్లో పనిచేసే సెంథిల్(తమిళనాడు వాసి), అతడి స్నేహితులు ఇద్దరు కనిపించారు. నాలుగు నెలల గర్భంతో ఉన్న మేకపై వారు అప్పటికే అత్యాచారం చేసి, చంపేశారు. కుంజూను చూడగానే అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. స్థానికుల సాయంతో సెంథిల్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు కుంజూ. అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. మిగిలిన ఇద్దరి కోసం వెతుకుతున్నారు.
ఇదీ చదవండి:ట'మాట'కు వృద్ధుడి ప్రాణం బలి- భార్యను టీజ్ చేశాడనుకుని కొట్టి చంపిన పక్కింటి వ్యక్తి!