తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రికాషన్​ డోసు కోసం వారికి ఆ సర్టిఫికెట్​ అవసరం లేదు' - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Precaution Dose: 60ఏళ్ల వయసుదాటి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి జనవరి 10 నుంచి భారత్​లో ప్రికాషన్​ డోసు అందించనున్నారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నాయనే ధ్రువీకరణ పత్రం లేకున్నా టీకా వేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత మూడో డోసు తీసుకోవాలని వెల్లడించింది.

precaution dose 60-plus population with co-morbidity
precaution dose 60-plus population with co-morbidity

By

Published : Dec 28, 2021, 5:17 PM IST

Updated : Dec 28, 2021, 6:38 PM IST

Precaution Dose: జనవరి 10 నుంచి దేశంలో కొవిడ్​ టీకా ప్రికాషన్​ డోసు అందించనున్నారు. ఆరోగ్య సిబ్బంది సహా 60 ఏళ్ల వయసుదాటి ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా వ్యాక్సిన్​ పంపిణీ చేయనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది.

60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి డాక్టర్​ సర్టిఫికెట్​ తప్పనిసరి కాదు అని వెల్లడించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​. అలాంటి వ్యక్తులు.. మూడో డోసు లేదా ప్రికాషన్​ డోసు తీసుకునే ముందు వైద్యుల సలహా మాత్రం తీసుకోవాలని సూచించారు.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మోహరించనున్న సిబ్బందిని ఫ్రంట్​లైన్​ వర్కర్ల జాబితాలో చేర్చాలని రాజేశ్​ భూషణ్​ స్పష్టం చేశారు.

''ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్​ డ్రైవ్​ భారత్​లో జరుగుతుంది. దేశంలో 142 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించాం. 90 శాతం మంది ఒక డోస్​, 62 శాతం మంది ప్రజలు రెండు డోసుల వ్యాక్సినేషన్​ పూర్తి చేసుకున్నారు. వృద్ధుల అనారోగ్యాన్ని నిర్ణయించడానికి డాక్టర్​ సర్టిఫికెట్​/ప్రిస్క్రిప్షన్​ అవసరం లేదు. 60 ఏళ్లు పైబడినవారు వైద్యులను సంప్రదించి వ్యాక్సిన్​ తీసుకోవచ్చు. రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత మూడో డోసు తీసుకోవాల్సి ఉంటుంది.''

- రాజేశ్​ భూషణ్​, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి

దేశంలో పిల్లలకు (15-18 ఏళ్లు) కొవిడ్ టీకా కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వీరికి దేశంలో కొవాగ్జిన్​ టీకా మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వివరించింది.

  • వాక్​-ఇన్​, ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ద్వారా 15-18 సంవత్సరాల వారికి కొవిడ్​ టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం.
  • కొవిన్​ రిజిస్ట్రేషన్​లు జనవరి 1న ప్రారంభవుతాయని వెల్లడి.
  • కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ల వద్ద 15-18 ఏళ్ల వారి కోసం ప్రత్యేక టీకా బృందాలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచన.

Omicron India: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రజలెవరు భయాందోళనకు గురికావద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత శనివారం పేర్కొన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Booster Dose Healthcare Workers: ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని మోదీ సూచించారు. 'ఒమిక్రాన్​'ను ఎదుర్కోవడానికి వైద్య వ్యవస్థ సన్నద్ధంగా ఉందని చెప్పారు. 5 లక్షల ఆక్సిజన్ పడకలు, 18లక్షల ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇవీ చూడండి: మోదీ చెప్పిన 'ప్రికాషన్​ డోసు'కు అర్థమేంటి? బూస్టర్​ కాదా?

మూడో డోసుగా ఏ టీకా ఇస్తారు? ఎన్ని రోజులకు?

Last Updated : Dec 28, 2021, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details