ఉత్తరాఖండ్ జలవిలయానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది ఇస్రో. వరద ఉద్ధృతికి ముందు.. తరువాత గల తేడాలను ఈ చిత్రాల ద్వారా ఇస్రో తెలిపింది. వరదల వల్ల రిషీ గంగా, ధౌళి గంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని డ్యాంలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఈ చిత్రాల్లో తెలుస్తుంది. వరద ధాటికి ధౌళి గంగా ప్రాంతంలో భారీ ఎత్తున శిథిలాలు పోగయ్యాయని చిత్రాలు వివరిస్తున్నాయి. ఈ చిత్రాలను కార్టొశాట్-3 శాటిలైట్ తీసింది. వీటిని హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విశ్లేషించింది.
చమోలీ తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరుగా సాగుతున్న వేళ ఇస్రో ఈ చిత్రాలను ప్రభుత్వ అధికారులకు అందించింది. ఈ ఘటనకు గల కారణాలను డీఆర్డీఓ, ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి దర్యాప్తు చేస్తున్నారు.