ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్ జిల్లాలో జవాఈన్-పసనా ప్రాంతాల మధ్య మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఊరికి దూరంగా ప్రమాదం జరగడం వల్ల వారిని ఎవరు కాపాడలేకపోయారు. ఉదయం బయటకు వచ్చిన సమీప గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
కారు ప్రమాదంలో నలుగురు సజీవదహనం - Accident in prayagraj
ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగులు మరణించారు. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని మంటలు చెలరేగడం వల్ల కారుతో పాటు నలుగురు సజీవదహనమయ్యారు.
కారు ప్రమాదంలో నలుగురు సజీవదహనం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో కారులోని మృతదేహాలను బయటకు తీశారు. అయితే మృతులు పూర్తిగా కాలిపోవడం వల్ల వారు ఎవరు అనేది గుర్తించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శవపరీక్ష కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:గుజరాత్లో రోడ్డు ప్రమాదాలు- 14 మంది మృతి