కుమారుడి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో అమానవీయ ఘటన జరిగింది. 14 ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాడు ఓ తండ్రి. మృతదేహాంపై ప్లాస్టిక్ కవర్ కప్పి భార్యతో కలిసి కిలోమీటర్లు నడుచుకుంటూ మోసుకెళ్లాడు. వీరికి దారిలో ఓ వ్యక్తి సాయం చేశాడు.
అసలేం జరిగిందంటే:
ప్రయాగరాజ్‌లోని కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బజరంగీ కుమారుడు శివమ్ మంగళవారం కరెంట్ షాక్‌కు గురయ్యాడు. దీంతో బజరంగీ, అతని భార్య సావిత్రి కలిసి ఎస్ఆర్ఎన్ ఆసుపత్రికి కుమారుడిని హుటాహుటిన తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివమ్ చనిపోయాడు. ఆ తర్వాత బాలుని మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేసినా.. ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఎంత బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది.
చేసేదేమీ లేక భుజాలపై కుమారుడి మృతదేహాన్ని మోసుకెళ్లాడు బజరంగీ. అంతలో ఓ వ్యక్తి ఆయనకు సాయం చేశాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం వీరికి సాయం చేసింది. మృతదేహాన్ని మోసుకెళ్తుండటాన్ని చూసిన ఆర్మీ అధికారులు చూసి.. రహదారిపై వెళ్తున్న ఓ అంబులెన్స్‌ను ఆపారు. అందులో శివమ్ మృతదేహం తరలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో, బజరంగీ.. శివమ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లగలిగాడు. ఈ ఘటనపై స్పందించిన ప్రయాగ్‌రాజ్ కమిషనర్ విజయ్ విశ్వాస్.. ఉన్నత స్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:NEXT CJI: కీలక తీర్పుల్లో భాగస్వామి... తర్వాతి సీజేఐ ఈయనే
దీదీ సర్కార్ దిద్దుబాటు చర్యలు.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. బాబుల్ సుప్రియోకు చోటు