ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. చనిపోయిన కుమార్తె మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లోనే పెట్టుకుని కూర్చున్నారు ఆమె తల్లిదండ్రులు. అంతేకాకుండా బతికించడానికి క్షుద్రపూజలు కూడా చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏం జరిగిందంటే?.. జిల్లాలోని కర్ఛన ప్రాంతంలోని డీహా గ్రామంలో 18 ఏళ్ల దీపిక మూడు రోజుల క్రితం చనిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఈ విషయాన్ని దాచారు యువతి కుటుంబసభ్యులు. మూడు రోజులుగా అలాగే ఉండటం వల్ల.. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. అది గమనించిన చుట్టుపక్కవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు.. ఇంటి లోపలకు వెళ్లి అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి షాకయ్యారు.
చనిపోయిన యువతిని బతికించడానికి ఆమె కుటుంబమంతా క్షుద్రపూజలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు.. యువతి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తెచ్చి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల మానసిక పరిస్థితి బాగాలేదని, వారిని ముందుగా విచారించి ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకు.. మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. కన్నతండ్రిని హత్య చేసి ఆపై ఓ ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితుడ్ని రాంలాల్గా గుర్తించారు.