కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi news) విమర్శలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant kishor). తన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సామర్థ్యాలను చూసి రాహుల్ భయపడుతున్నారని ఆరోపించారు. ప్రియాంక అచ్చం తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీలానే ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలున్నాయని అన్నారు. 2017 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP election 2022) కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా.. ప్రియాంకను ప్రకటించకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
''ప్రియాంకా గాంధీ.. తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉంటారు. ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలను ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రియాంకలో ఉన్న ఈ లక్షణాలే.. రాహుల్‌ను భయపెడుతున్నట్లున్నాయి. అందుకే 2017 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(UP election 2022) కోసం.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించలేదు.''
- ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త
పట్నాలో రాహుల్‌ను(Rahul Gandhi news) తొలిసారి కలిశానని, అప్పుడే తనను కాంగ్రెస్ కోసం పనిచేయమని అడిగినట్లు చెప్పుకొచ్చారు పీకే (Prashant kishor). అయితే బిహార్‌లో రాజకీయ పరిస్థితులు బాగాలేవని, ముఖ్యంగా కాంగ్రెస్‌కు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారాయని అన్నారు.
ఇదీ చూడండి: రాహుల్‌తో పీకే భేటీ- ఆ ఎన్నికలపై చర్చ!
అది తొందరపాటే..
కొద్దిరోజులక్రితం కూడా ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఉదంతంపై ఉద్యమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని ఆశపెట్టుకోవడం తొందరపాటు అవుతుందని (Prashant Kishor Congress) హెచ్చరించారు. అంతర్గతంగా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ పునరుత్థానం సాధించలేదని చెప్పారు.