సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అవసరం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం హెలికాఫ్టర్ అందుబాటులో ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేసిన ప్రశాంత్ భూషణ్.. అందుకు విచారం వ్యక్తం చేశారు. అందులో తప్పు ఉందని ఒప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై వేటు వేసే కేసు విచారణలో ఉండగా ప్రభుత్వం నుంచి సహాయం పొందడంపై అభ్యంతరం తెలిపారు.
'సీజేఐకి హెలికాప్టర్' వ్యాఖ్యలపై ప్రశాంత్ భూషణ్ విచారం
అక్టోబర్ 21న ట్వీట్టర్ వేదికగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజేఐ బోబ్డేకు ప్రత్యేక హెలికాఫ్టర్‌ను అందుబాటులో ఉంచడంపై నాడు తీవ్రంగా విమర్శించారు.
ఉపఎన్నికల్లో గెలవకపోయనా శివరాజ్ ప్రభుత్వం పడిపోతుంది
అయితే నవంబర్ 4న మరో ట్వీట్లో ఇదే విషయాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. 'శివరాజ్‌సింగ్ ప్రభుత్వం నిలబడేందుకు కోర్టు కేసులు మాత్రమే కారణం అనుకున్నాను. అది తప్పు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో గెలవక పోయినా ప్రభుత్వం పడిపోతుంది' అని అన్నారు.
ఇదీ చూడండి: ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా