11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈవీఎంల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. దేశంలోని సామాన్య పౌరుడు సైతం సాధికారత సాధించేందుకు ఈవీఎం.. ఓ సాధనంలా పనిచేస్తోందన్నారు. ఓటర్స్ డే సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
" మనకు ఈవీఎంల పనితీరుపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ అన్ని సంస్థలకు ఈవీఎం శక్తినిచ్చిందన్న వాస్తవాన్ని మనం తప్పుపడతామా? సామాన్య పౌరుడికి శక్తినిచ్చే ఎలాంటి సాధనమైనా మనం స్వాగతించాలి. మేము(భాజపా) దిల్లీలోని అన్ని లోక్సభ సీట్లను కైవసం చేసుకున్నాం. కానీ అసెంబ్లీ సీట్లను కోల్పోయాం. రెండు ఎన్నికలు ఈవీఎంల ద్వారానే జరిగాయి."
----రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి