తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2023, 9:31 PM IST

Updated : Aug 12, 2023, 10:41 PM IST

ETV Bharat / bharat

రాష్ట్రంలో స్కూళ్లను అందుకే తగలబెట్టాం.. కార్పొరేట్​ కంపెనీలతో బీజేపీ కుమ్మక్కు!: మావోయిస్ట్ అగ్రనేత

Pramod Mishra CPI Maoist Leader : బిహార్​లో ఇటీవల అరెస్ట్​ అయిన మావోయిస్టు అగ్రనేత ప్రమోద్​ మిశ్రా.. సంచలన విషయాలు బయటపెట్టారు. బిహార్​లో పాఠశాలలను తామే తగలబెట్టామని అంగీకరించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వంపై, ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Pramod Mishra CPI Maoist
Pramod Mishra CPI Maoist

Pramod Mishra CPI Maoist Leader : కేంద్ర బలగాలు, పోలీసు సిబ్బంది షెల్టర్​ హౌస్​లుగా పాఠశాలలను ఉపయోగిస్తుండటం వల్లే.. వాటిని తగలబెట్టామని ఇటీవల అరెస్ట్ అయిన మావోయిస్టు అగ్రనేత ప్రమోద్ మిశ్ర అంగీకరించారు. బిహార్​ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో మాట్లాడిన మిశ్ర.. సంచలన విషయాలు బయటపెట్టారు. బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అలాగే ప్రతిపక్ష నాయకత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

బీజేపీని ఫాసిస్ట్​ శక్తిగా అభివర్ణించిన మిశ్ర.. బడా కార్పొరేట్​ కంపెనీలతో కుమ్మక్కై ప్రజలను దోపిడీ చేయడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మార్క్సిజం, న్యూ డెమోక్రసీ, సోషలిజం, కమ్యూనిజం సిద్ధాంతాలతోనే ప్రజలకు నిజమైన విముక్తి లభిస్తుందని అన్నారు. దేశంలోని సమస్యలపై ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. 'మణిపుర్​ గురించి ఆలోచించండి. అక్కడ ఏం జరుగుతుంది? కానీ అక్కడ ప్రతిపక్షాల పాత్ర ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. ఇలా చేయడం ద్వారా ఒక విధంగా వారు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు' అని ఆరోపించారు.

తూర్పు జోనల్​ కమాండర్​గా బిహార్​, ఝార్ఖండ్​, ఒడిశా, బంగాల్​, ఈశాన్య రాష్ట్రాలతో సహా తదితర ప్రాంతాలకు బాధ్యత వహించారు ప్రమోద్​ మిశ్ర. అయితే, ఇటీవల ప్రముఖ మావోయిస్టు నేత సందీప్​ యాదవ్ అలియాస్ బడే సర్కార్​ చనిపోవడం వల్ల మావోయిస్టు పార్టీలో అనిశ్చితి నెలకొందని మిశ్ర తెలిపారు. దీంతో పార్టీ పరాజయాలను చవిచూసిందని అంగీకరించారు. కానీ ఇప్పటివరకు ఆయన స్థానంలో పార్టీ మరో నేతను భర్తీ చేయలేదన్నారు.

అయితే ఆగస్టు 10న తలపై రూ.కోటి రివార్డు ప్రమోద్‌ మిశ్రను, అనుచరుడిని బిహార్‌లో అరెస్ట్‌ చేశారు. మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మిశ్ర, అతని అనుచరుడు అనిల్‌ యాదవ్‌లు గయ జిల్లా టెకారి బ్లాక్‌లో తలదాచుకున్నట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే ప్రత్యేక దళాలతో గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరినీ పట్టుకున్నామని సీనియర్‌ ఎస్పీ ఆశిష్‌ భారతి తెలిపారు.

మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మిశ్ర, అనిల్‌ అనేక విధ్వంసాలకు పాల్పడ్డారని, వారిపై వేర్వేరు రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయని చెప్పారు. 2008లో అరెస్టై తొమ్మిదేళ్లు జైల్లో గడిపారు మిశ్ర. 2017లో విడుదలయ్యాక ఆయన ఆచూకీ చిక్కలేదని, అమెరికా రూపొందించిన తీవ్రవాదుల జాబితాలోనూ ఆ పేరు ఉందని పోలీసులు వివరించారు. గయలో ఏదైనా భారీ ఘటనకు పాల్పడేందుకు వీరు యోచిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.

జాతీయ స్థాయిలో మావోయిస్టు పార్టీలో కీలక వ్యూహకర్తగా ప్రమోద్‌ మిశ్ర నిలుస్తారు. పార్టీ తూర్పు ప్రాంతీయ బ్యూరో (ఈఆర్‌బీ) అధిపతి పదవి కోసం ప్రమోద్‌ ప్రయత్నించినా, ఇటీవల జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సమావేశంలో మిసిర్‌ బెస్రను ఆ పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం.

'హిడ్మా' బతికే ఉన్నాడా.. మావోయిస్టుల క్లారిటీ ఇదే

మావోయిస్టు హిడ్మాకు ఏమైంది.. చనిపోయారన్నది నిజమేనా?

Last Updated : Aug 12, 2023, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details