Woman Murder Case Update: ఆమె స్నేహితుడైన కాశి రెడ్డికి భారీ మొత్తంలో రుణం ఇప్పించిన మృుతురాలు.. తిరిగి రుణాన్ని అతని వద్ద నుంచి రాబట్టుకోలేకపోయింది. భారీ మొత్తంలో నగదు రుణం ఇప్పించిన వ్వవహారం.. ఆమె కుటుంబంలో కలహాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎలగైనా తన భార్యను మట్టుబెట్టాలని మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో 15 రోజులుగా సెల్‌ఫోన్ మేసేజ్‌లతో నాటకానికి తెరలేపాడు. ఈ తరుణంలో ఆమె పుట్టిన ఊరికి సమీపాన నిర్వహించే చౌడేశ్వరీ దేవి కొలుపులకు హాజరయ్యేందుకు గాను రాధ ఇటీవలే పుట్టింటికి చేరింది. దీనిని ఆమె భర్త సానుకూలంగా చేసుకుని అవకాశంగా వాడుకున్నాడు. కాశిరెడ్డి పేరిట సిమ్ కార్డులు కొనుగోలు చేశాడు. అతని పేరుతోనే రాధకు సెల్‌ఫోన్‌కు సందేశాలు పంపుతూ ఛాటింగ్ చేశాడు. భర్తే కాశిరెడ్డి పేరుతో సందేశాలు పంపుతున్న విషయాన్ని రాధ పసిగట్టలేకపోయింది.
తన భార్య రాధతో మోహన్ రెడ్డి గత వారం రోజులుగా పలు సిమ్‌కార్డుల నుంచి ఛాటింగ్ చేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. హత్య జరగటానికి కొద్ది గంటల ముందు కూడా సూర్యాపేటలో.. కాశిరెడ్డి పేరుతోనే సందేశాలు పంపాడు. ఓ చెరకు రసం బండి నిర్వాహకుడికికి తన సెల్‌ఫోన్ పనిచేయటం లేదని చెప్పి నమ్మబలికి.. అతని సెల్‌ఫోన్ నుంచి కాశిరెడ్డి పేరుతో తీసుకున్న సిమ్ వేసి సందేశాలు పంపాడు. పల్నాడులోని వినుకొండకు చేరుకున్న తర్వాత.. మరొకరి నుంచి సెల్ తీసుకుని, తన సిమ్ వేసి సాయంత్రం కనిగిరి వస్తానని ఆమెకు మెసేజ్ చేశాడు. కనిగిరి చేరుకున్న తర్వాత పామూరు బస్టాండ్‌లో అక్కడ ఓ యువతితో మాటలు కలిపి.. ఆమె ఫోన్ నుంచి కూడా తాను కనిగిరి వచ్చానని మరో సందేశం పంపాడు. కాశిరెడ్డి వచ్చాడని, డబ్బు ఇస్తాడని అనకున్న రాధ కనిగిరికి చేరుకుంది.