తెలంగాణ

telangana

ETV Bharat / bharat

pradhan mantri matru vandana yojana : "మాతృ వందన" పథకానికి అప్లై చేశారా..? ఉచితంగా రూ.5వేలు ఆర్థిక సాయం!

pradhan mantri matru vandana yojana : గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అదే "ప్రధానమంత్రి మాతృ వందన యోజన". చాలామందికి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలో తెలియక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలాంటి వారి కోసమే ఈ కథనం. మరి, ఈ స్కీమ్​కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

Pm Matru Vandana Yojana
Pradhan Mantri Matru Vandana Yojana

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 12:29 PM IST

How to Apply Pradhan Mantri Matru Vandana Yojana in Telugu : ప్రతి స్త్రీ.. 'అమ్మ' అని పిలిపించుకోవడానికి ఆశపడుతుంది. ఆ తర్వాత తన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంటే చూసి మురిసిపోతుంది. కానీ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది గర్భిణులు, బాలింతలు సరైన పోషక ఆహారం తీసుకోలేరు. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. అందుకే.. కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రధానమంత్రి మాతృ వందన యోజన(PMMVY) అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన గర్భిణులు, పాలిచ్చే తల్లులకు రూ.5వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. మరి, ఈ పథకానికి ఎవరెవరు అర్హులు? కావాల్సిన పత్రాలు ఏంటి..? ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

PM Matru Vandana Yojana Eligibility Criteria in Telugu :

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన అర్హత ప్రమాణాలివే..

  • గర్భిణులందరూ పీఎంఎంవీవై పథకానికి అర్హులు.
  • ఈ పథకం ద్వార లబ్ధి పొందే మహిళ వయస్సు తప్పనిసరిగా 19 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
  • తొలి ప్రసవానికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అందుతాయి.
  • అన్ని రాష్ట్రాల్లో పీఎంఎంవీవై స్కీమ్ అమలులో ఉంది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే వారికి ఈ పథకం వర్తించదు.

Required Documents for PMMVY Scheme :

పీఎంఎంవీవై(PMMVY) పథకానికి దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు..

  • ఆధార్ కార్డ్
  • ఓటరు గుర్తింపు కార్డు
  • రేషన్ కార్డు
  • కిసాన్ ఫొటో పాస్‌బుక్
  • పాస్​పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్
  • పాన్ కార్డ్
  • MGNREGS జాబ్ కార్డులలో ఆధార్ లేకపోతే ఏదో ఒకటి గుర్తింపు కార్డు అవసరం.
  • భర్త ఆధార్ కార్డ్
  • MCP(మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్) కార్డు
  • LMP(Last Menstrual Period) డేట్
  • బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్

Best Central Government Schemes For Girls: ఆడపిల్లల కోసం.. 5 బెస్ట్ ప్రభుత్వ పథకాలు!

How to Apply Pradhan Mantri Matru Vandana Yojana in Online :

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలంటే..?

  • మొదట మీరు https://pmmvy-cas.nic.in/. అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • హోమ్​ పేజీలో కుడివైపున.. లబ్ధిదారు లాగిన్ ఎంపిక (PMMVY లాగిన్)పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు రిజిస్టర్డ్ కస్టమర్ల ఈమెయిల్ IDలు, పాస్‌వర్డ్‌లను అడుగుతుంది.
  • కొత్తవారైతే.. Registering a new user అని కనిపించే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు డైరెక్ట్ బెనిఫిషియరీ యూజర్ క్రియేషన్ ఫారమ్ కనిపిస్తుంది.
  • దాంట్లో మీరు లబ్ధిదారుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి పూర్తి వివరాలను నమోదు చేయాలి.
  • మొదటి పేజీకి కుడి వైపున సూచన ప్రశ్న ఉంటుంది. అప్పుడు మీరు సూచన ప్రశ్న, సూచన సమాధానాన్ని పూరించాలి.
  • ఆ తర్వాత మీరు మీ పాస్​వర్డ్​ను క్రియేట్ చేసుకోవాలి.
  • మీ పాస్‌వర్డ్‌ని నిర్ధారించిన తర్వాత ఒక క్యాప్చా ఉంటుంది. దానిని నమోదు చేయాలి.
  • ఇక చివరగా రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేస్తే మీరు యాక్టివేషన్ లింక్‌ని అందుకుంటారు. అప్పుడు రిజిస్ట్రేషన్‌ని యాక్టివేట్ చేయడానికి దానిపై క్లిక్ చేయాలి. ఇలా సింపుల్​గా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

PMMVY Scheme Benefits : కేంద్ర ప్రభుత్వం 2017లో తీసుకొచ్చినపీఎంఎంవీవై(PMMVY)పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు మూడు దశల్లో రూ. 5వేలు అందిస్తోంది. మొదటి విడుతగా గర్భం దాల్చినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు కాగానే రూ.1,000, రెండో విడుతగా ఆరునెలల అనంతరం రూ.2,000, ఇక చివరగా ప్రసవం జరిగిన 14 వారాల్లో ‘ఇమ్యూనైజేషన్‌ సైకిల్‌’ పూర్తయిన తర్వాత రూ.2,000 నేరుగా బ్యాంక్‌ ఖాతాలకు జమచేస్తున్నారు.

How to Download Ayushman Bharat Card : మీకు "ఆయుష్మాన్ భారత్" కార్డు ఉందా..? రూ.5 లక్షల దాకా ఉచిత వైద్యం.. ఇలా పొందండి!

Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజనతో 'ఆమె' భవిష్యత్ బంగారం.. రూ.300తో రూ.50 లక్షల మెచ్యూరిటీ!

Pradhan Mantri Suraksha Bima Yojana PMSBY : రూ.20లకే రూ.2లక్షల ప్రమాద బీమా.. చేరండిలా!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details