దేశంలో బొగ్గు కొరతతో(coal shortage in india) విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనల నడుమ పలు రాష్ట్రాలు కరెంట్ కోతలకు సిద్ధమవుతున్నాయి(coal shortage news). ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్ కోతలు(power crisis in india ) అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న 'కేటాయించని విద్యుత్'ను(power crisis latest news) వాడుకోవాలని తెలిపింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు 'కరెంట్' సాయం చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేడు ప్రకటన విడుదల చేసింది.
"బొగ్గు కొరత(coal shortage in india 2021) ఆందోళనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు కరెంట్ సరఫరా చేయకుండా లోడ్ సర్దుబాటు కోసం కోతలు విధిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో వారు అధిక ధరలకు విద్యుత్‌ను విక్రయిస్తున్నట్లు కూడా తెలిసింది. వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే(power crisis latest news). ముందు వారు తమ వినియోగదారులకే సేవలందించాలి. 24×7 విద్యుత్ అందించాలి. తమ సొంత వినియోగదారులకు కరెంట్ సరఫరా చేయకుండా విద్యుత్‌ను విక్రయించకూడదు" అని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.