తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NEET 2021: 'ఒత్తిడిని పట్టించుకోరా?.. నీట్​ వాయిదా వేయండి' - neet exam postpone latest news

సెప్టెంబరు 12న జరిగే నీట్‌ పరీక్షను(NEET 2021) వాయిదా వేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్​ చేశారు. విద్యార్థుల ఒత్తిడిని పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.

rahul gandhi on neet
నీట్​ పరీక్షపై రాహుల్ స్పందన

By

Published : Sep 7, 2021, 12:39 PM IST

వచ్చే ఆదివారం జరగబోయే నీట్‌ పరీక్షను(NEET exam date 2021) వాయిదా వేయాలని(NEET exam postpone) కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఒత్తిడిని ప్రభుత్వం పట్టించుకోకుండా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.

సెప్టెంబరు 12న జరిగే నీట్‌ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది (NEET exam controversy). అదే రోజున 12వ తరగతి ఇంప్రూవ్‌మెంట్‌/కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు ఉన్నందున నీట్‌ను వాయిదా వేయాలని పలువురు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. నీట్‌ జాతీయ స్థాయి పరీక్షలు కావడంతో దాంట్లో జోక్యం చేసుకోవడం సబబు కాదని, ఒక్కశాతం మందికోసం మొత్తం వ్యవస్థను ఆపలేమని కోర్టు అభిప్రాయపడింది.

ఈ పరిణామాలపై నేడు ట్విట్టర్‌ వేదికగా స్పందించిన రాహుల్‌ గాంధీ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. "విద్యార్థుల ఒత్తిడిని ప్రభుత్వం చూడట్లేదు. నీట్‌ను వాయిదా వేయండి. వారికి న్యాయమైన అవకాశం కల్పించండి" అని ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి:నీట్​ వాయిదాకు సుప్రీం నో- షెడ్యూల్​ ప్రకారమే పరీక్ష

రాహుల్​ గాంధీ ఒక 'రాజకీయ కోకిల': భాజపా

ABOUT THE AUTHOR

...view details