Kerala Pre Wedding Shoot Couple: కేరళలో సాహసోపేతమైన 'పోస్ట్ వెడ్డింగ్' షూట్లు, 'సేవ్ ది డేట్' షూట్లు క్రేజ్‌గా మారిపోయాయి. ఇలాంటి కార్యక్రమాల్లో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కోజికోడ్ సమీపంలోని కుట్టియాడికి చెందిన నవ జంట ఫొటో షూట్ చేస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా..వధువు పరిస్థితి విషమంగా ఉంది.
ప్రాణం తీసిన 'ఫొటో షూట్' సరదా.. నదిలో కొట్టుకుపోయిన నవ జంట - కేరళ న్యూస్
Kerala Pre Wedding Shoot Couple: కేరళకు చెందిన ఓ నవ జంట పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో కొట్టకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మరణించగా.. వధువు పరిస్థితి విషమంగా ఉంది.
నవ జంట
ఇదీ జరిగింది:కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత షూట్‌కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో రెజిల్ మరణించగా.. కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి:బాయ్‌ఫ్రెండ్ కారణంగా గర్భం.. యూట్యూబ్ చూసి అబార్షన్.. కానీ...