తనకు పదవి ఉన్నా, లేకున్నా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెంటే ఉంటానని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Punjab news). జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా.. ట్వీట్ చేశారు సిద్ధూ. వారి సిద్ధాంతాలను పాటిస్తానని, అదే విధంగా గాంధీల వెంట నిలబడతానన్నారు.
''గాంధీ, శాస్త్రి సిద్ధాంతాలను పాటిస్తా. పదవి ఉన్నా, లేకున్నా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెంట నిలబడతా. అన్ని వ్యతిరేక శక్తులు నన్ను ఓడించేందుకు ప్రయత్నించనివ్వండి. కానీ సానుకూల శక్తితో .. పంజాబ్ గెలుపును, సోదరభావాన్ని, ప్రతి పంజాబీనీ గెలిపించేందుకు కృషి చేస్తా.''
- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
సిద్ధూతో విభేదాల నేపథ్యంలో.. పంజాబ్(Punjab news) ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను(Sidhu Amarinder singh) తప్పించి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీని నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం.
ఆ తర్వాత సిద్ధూపై(Sidhu news) విమర్శలు గుప్పించారు అమరీందర్ సింగ్. ఒకవేళ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే... కచ్చితంగా ఓడిస్తానని శపథం పూనారు. రాహుల్, ప్రియాంకకు అనుభవం లేదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.
కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కొన్ని పదవుల నియామకంపై అసహనం వ్యక్తం చేశారు సిద్ధూ. కొందరు కేబినెట్ మంత్రులు సహా తాత్కాలిక డీజీపీ, ఏజీ నియామకాల్ని ప్రశ్నించారు. ఇదే కారణంతో... పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు.
పార్టీలో సంక్షోభాన్ని తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సీఎం.. సిద్ధూను చర్చలకు ఆహ్వానించారు. చండీగఢ్‌లోని పంజాబ్(Punjab news) భవన్లో సెప్టెంబర్ 30న భేటీ అయ్యారు. కానీ.. సిద్ధూ రాజీనామాను కాంగ్రెస్ ఆమోదించిందా లేదా అనేది స్పష్టత లేదు.
ఇవీ చూడండి:'అందుకే ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించా'
మహాత్మా గాంధీకి ప్రముఖుల నివాళులు