Post Office recruitment 2023 : నిరుద్యోగులకు భారత తపాలాశాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏకంగా 12,828 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇండియా పోస్ట్ 2023 రిక్రూట్‌మెంట్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
India post office recruitment 2023 : భారతదేశంలోనే అతిపెద్ద పోస్టల్ వ్యవస్థ కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్ పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న 12,828 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దేశంలోని 28 రాష్ట్రాల్లో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా పోస్టాఫీస్ బ్రాంచ్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. ఏపీలో 118, తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ
Post Office recruitment 2023 apply online : మే 22న దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.. జూన్ 11 తేదీ వరకు గడువు ఉంది. జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తుల్లో ఏమైనా వివరాలు తప్పులు ఎంటర్ చేసి ఉంటే మార్చుకునే వెసులుబాటు కల్పించారు. https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
జీతభత్యాలు
Post Office salary : బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు జీతం రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు ఉంటుంది. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు ఎంపికైనవారికి పోస్టాఫీస్ ఉన్న గ్రామంలో నివసిస్తే వసతి సౌకర్యం కల్పిస్తారు.
వయోపరిమితి
వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎలాంటి వయో సడలింపు ఉండదు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు
Post Office eligibility : మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో టెన్త్ ఉత్తీర్ణణ సాధించి ఉండాలి. టెన్త్ వరకు స్థానిక భాషలో చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ నడపడం వచ్చి ఉండాలి.
ఎంపిక విధానం
Post Office 10th pass jobs 2023 : టెన్త్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా చేసుకుని మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిపైన అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ పంపుతారు. మెసేజ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు వివరాలు
జనరల్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఆన్‌లైన్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానం ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫోటు, మీ సంతకంతో కూడిన పేపర్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.