తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సాపట్టు రమణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా అల్లోపతి మెడికల్ క్లినిక్‌ను నడుపుతున్నారనే కారణంతో పోలీసులు మే 27న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్లినిక్‌ను సీజ్ చేశారు.
కల్లాకురిచీ జిల్లా కూగైయూరు అనే గ్రామానికి చెందిన సాపట్టు రమణ్.. తన పేరు మీదే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. బీఈఎమ్ఎస్(సిద్ధ వైద్యం)లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఆయన..28 ఏళ్లుగా అక్రమంగా అల్లోపతి క్లినిక్ నడుపుతున్నారని పోలీసులు తెలిపారు.