Poonch road accident: టాటా సుమో అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని పుంఛ్ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది. పెళ్లికి వెళ్లి ఇంటికి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ వాహనంలో వివాహానికి హాజరైన అతిథులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అదుపు తప్పి లోయలో పడిన వాహనం.. 9 మంది మృతి
Poonch road accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
లోయలో పడిన పడిన టాటా సుమో
పుంఛ్ జిల్లాలోని మర్హా గ్రామం నుంచి బుఫ్లియాజ్ వైపు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. రోడ్డుపై నుంచి వెళ్తున్న సుమో తరన్ వలీ వద్ద అదుపుతప్పి లోయలో పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని పుంఛ్ కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి:అర్ధరాత్రి ఇంట్లోకి దొంగలు.. రఫ్ఫాడించిన యువతి.. దెబ్బకు పరార్!
Last Updated : Apr 1, 2022, 7:42 AM IST