పూజా చౌహాన్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి సంజయ్ రాఠోడ్‌పై ఆమె బంధువు తీవ్ర ఆరోపణలు చేశారు. కేసుపై మౌనం వహించేలా పూజ తల్లిదండ్రులకు సంజయ్ భారీ మొత్తంలో డబ్బును ముట్టజెప్పారని పేర్కొన్నారు. మృతురాలి అమ్మమ్మ అయిన శాంతాబాయి రాఠోడ్.. నిందితుడు రూ. 5 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఆ డబ్బును మృతురాలి తల్లిదండ్రులు రహస్యంగా దాచి పెట్టారన్నారు. అయితే ఈ ఆరోపణలను రాఠోడ్ ఖండించారు.
'పూజ తల్లిదండ్రులకు మంత్రి డబ్బులిచ్చారు' - మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాఠోడ్
పూజా చౌహాన్ కేసుపై ఆమె అమ్మమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుపై నోరుమెదపకుండా ఉండేందుకు పూజా తల్లిదండ్రులకు మాజీ మంత్రి సంజయ్ రాఠోడ్ రూ. 5 కోట్లు లంచం ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను రాఠోడ్ ఖండించారు.
'పూజా తల్లిదండ్రులకు మంత్రి డబ్బులిచ్చారు'
ప్రముఖ టిక్‌టాక్ స్టార్ పూజా చౌహాన్ (22) ఫిబ్రవరి 8న ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణం తర్వాత బయటపడ్డ కొన్ని ఆడియో క్లిప్స్.. పూజ మృతిపై సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో సంజయ్ రాఠోడ్ హస్తం ఉందన్న ఆరోపణలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడం వల్ల రాఠోడ్ ఆదివారం.. మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇదీ చదవండి :'ఆయన నాయకత్వంలో కొత్త కూటమి అవసరం'