sc on pollution in delhi: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌తో సహా నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను ఏ మేరకు పాటిస్తున్నారో తెలపాలని దిల్లీ, ఎన్‌సీఆర్ రాష్ట్రాలను కోరింది. ఒకవేళ పాటించలేకపోతే దానికి సంబంధించి అఫిడవిట్లను బుధవారం సాయంత్రంలోగా దాఖలు చేయాలని ఆదేశించింది.
"కాలుష్యంపై కమిటీ ఇచ్చిన సూచనలు మంచివి. కానీ ఫలితం శూన్యం. ఉల్లంఘించినవారికి రూ.1000 జరిమానా విధించడం లేదా ఒక రోజు జైలు శిక్ష విధించడం వంటి చర్యలు పని చేయట్లేవు. కాలుష్యాన్ని ఎలా అరికట్టాలని మనం పోరాడుతున్నాము. మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు. మాకు అన్నీ తెలుసు. పిటిషన్లో కొన్ని అంశాలను దాటవేసి ప్రధాన సమస్యని దారి మళ్లించే ప్రయత్నం చేయవద్దు."