తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో అంతకంతకూ క్షీణిస్తున్న వాయు నాణ్యత

దిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాయు నాణ్యత అంతకంతకూ క్షీణిస్తోంది. పంజాబీబాగ్​ ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో వాయు నాణ్యత సూచీ 432 పాయింట్లకు చేరింది.

Pollution continues to rise in the national capital Delhi
దిల్లీలో తీవ్ర స్థాయికి క్షీణించిన గాలి నాణ్యత

By

Published : Nov 7, 2020, 10:48 AM IST

Updated : Nov 7, 2020, 11:33 AM IST

దేశ రాజధాని దిల్లీలో కాలుష్య తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. పంజాబీబాగ్​ ప్రాంతంలో వాయు నాణ్యత సూచీ 432(తీవ్ర స్థాయి)గా నమోదైంది. కాలుష్య ప్రభావంతో రోడ్లపై దుమ్ము, ధూళీ అలుముకోవడం వల్ల.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్లే గాలి నాణ్యత ఇలా తీవ్ర స్థాయికి క్షీణించినట్టు తెలుస్తోంది.

దిల్లీలో తీవ్ర స్థాయికి క్షీణించిన గాలి నాణ్యత

నియంత్రణ చర్యలు..

కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది కేజ్రీవాల్​ సర్కార్​. అందులో భాగంగా కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ స్మోగ్​ గన్​లను ఏర్పాటు చేసింది.

యాంటీ స్మోగ్​ గన్​

మరోవైపు దిల్లీలో చలి తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ఫలితంగా మంచు ప్రభావం అధికమవుతోంది.

ఇదీ చదవండి:దేశంలో లక్షా 25వేలు దాటిన కరోనా మరణాలు

Last Updated : Nov 7, 2020, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details