ఝార్ఘండ్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. చత్రా జిల్లాలో నడవలేక ఇబ్బంది పడుతున్న ఓ పోలింగ్ కార్యకర్త.. భార్య భుజాలపై ఎన్నికల విధులకు హాజరయ్యారు. దీంతో అతడిని అందరూ ప్రశంసిస్తుండగా.. మరికొందరు అతడి భార్య ధైర్యాన్ని కొనియాడుతున్నారు..
చత్రా జిల్లాలో మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే భార్య భుజాలపై చత్రా కాలేజీ ఆవరణలోకి చేరుకున్నాడు మనోజ్ ఉరావ్. సీసీఎల్ అశోక ఓసీపీలో సహాయకుడిగా పనిచేస్తున్నారు మనోజ్. ఇటీవలే కాలికి గాయమైనందు వల్ల అతడు నడవలేక ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ మనోజ్‌కు ఎన్నికల డ్యూటీ విధించారు.
భార్య భుజాలపై విధులకు హాజరైన పోలింగ్ కార్యకర్త దీంతో విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని మనోజ్ భావించారు. అయితే అక్కడికి ఎలా చేరుకుంటారనేదే ప్రశ్న? అందుకు సమాధానంగా నిలిచారు అతడి భార్య. భర్త విధుల కోసం ఆమె ముందుకొచ్చారు. అతడిని భుజాలపై కాలేజ్ క్యాంపస్‌కు మోసుకొచ్చారు.
అయితే మనోజ్‌ను పోలింగ్ విధులకు హాజరు కానివ్వలేదు అధికారులు. మెడికల్ బోర్డ్ బందం.. అతడిని అనర్హుడిగా ప్రకటించింది. విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. అయితే.. పని పట్ల మనోజ్, అతడి భార్య అంకితభావం పట్ల అక్కడున్న వారందరూ వారిని కొనియాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తికి డ్యూటి ఎందుకు వేశారనే ప్రశ్న కూడా ఎదురవుతోంది.
ఇదీ చూడండి:త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ రాజీనామా