Polling Ended in 13 Constituencies of Telangana : తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Election Polling) ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్ ముగిసింది. బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, చెన్నూర్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
ఆ 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్
Polling Ended in 13 Constituencies of Telangana : తెలంగాణలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 4 గంటల వరకు వరుసలో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. రాష్ట్రంలో మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
Published : Nov 30, 2023, 10:48 PM IST
Telangana Assembly Elections Polling 2023 : రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. అయితే సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌కు అధికారులు అనుమతించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు(Voting percentage Telangana) ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్ నమోదైందనట్లు ప్రకటించారు.
Telangana Assembly Elections Voting 2023 :మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో లోపల ఉన్న వ్యక్తులను మాత్రమే ఉంచి బయటనుంచి వచ్చే వారిని అనుమతించకుండా పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లను పోలింగ్ సిబ్బంది మూసివేశారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాల వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినప్పటికీ పోలింగ్ సిబ్బంది వారిని అనుమతించలేదు.