తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేప్ కేసులో అధికార పార్టీ నేత అరెస్ట్

తమిళనాడు పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. వీరిలో ఒకరు అన్నాడీఎంకే విద్యార్థి సంఘం నేత కాగా... అతడ్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది.

CBI
పొల్లాచ్చి కేసులో ముగ్గురు అరెస్టు: సీబీఐ

By

Published : Jan 6, 2021, 6:05 PM IST

తమిళనాడులో కలకలం రేపిన పొల్లాచ్చి కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.

ఇదీ జరిగింది..

ఓ కళాశాల విద్యార్థినిని నలుగురు యువకులు లైంగికంగా వేధించారు. ఆమె అశ్లీల చిత్రాలు తీసి సామజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేస్తామంటూ మానసికంగా ఒత్తిడి తెచ్చారు.

ఇదీ చదవండి:పొల్లాచ్చి కేసు సీబీఐకి బదిలీ

ఫిబ్రవరి 12న కోయింబత్తూరు జిల్లాలో... లైంగిక వేధింపులతో పాటు బంగారు నగలు దొంగతనం చేశారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, లైంగిక వేధింపులకు సంబంధించి నలుగురిపై మొదటి కేసు నమోదైంది. ఫిబ్రవరి 26న బాధితురాలి సోదరుడిపై జరిగిన దాడి విషయంలో మరో నలుగురు నిందితులపై కేసు నమోదైంది.

సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో... శబరి రాజన్, తిరునవుకరాసు, సతీష్, వసంతకుమార్, సెంతిల్, బాబు, మణి, వసంతకుమార్​ను నిందితులుగా పేర్కొంది.

ఇదీ చదవండి:'వలస పక్షులతోనే బర్డ్ ​ఫ్లూ- అప్రమత్తంగా కేంద్రం'

ABOUT THE AUTHOR

...view details