ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బుధవారం మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం.. దిల్లీలోని శరద్ పవార్ నివాసంలో రాష్ట్ర మంచ్(జాతీయ సమాఖ్య) భేటీ అయి పలు అంశాలపై చర్చించిన నేపథ్యంలో.. పవార్, పీకే మూడోసారి భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే.. పక్షం రోజుల్లోనే వీరు మూడుసార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయాలకు ఇది ఆరంభమా అనే చర్చ మరింత ఊపందుకుంది. ఇటీవలే బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు తిరుగులేని విజయం అందించడంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు.