తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇది పిటిషన్​లా లేదు.. ప్రచార ప్రయోజన వ్యాజ్యంలా ఉంది'

Poll Freebies: ఎన్నికల్లో ఉచిత హామీలపై నమోదైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యంలా లేదని.. ప్రచార ప్రయోజన వ్యాజ్యంలో ఉందని అభిప్రాయపడింది. కేవలం కొన్ని ఎంపిక చేసిన పార్టీలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చడాన్ని తప్పుపట్టింది.

supreme court
సుప్రీం కోర్టు

By

Published : Mar 4, 2022, 6:45 AM IST

supreme court: ఎన్నికల్లో ఉచిత హామీలిచ్చే పార్టీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యంలా లేదని, ప్రచార ప్రయోజన వ్యాజ్యంలా ఉందని వ్యాఖ్యానించింది. అందరినీ ఉద్దేశించి కాకుండా కేవలం కొన్ని ఎంపిక చేసిన పార్టీలను (కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ, ఆప్‌) పిటిషనర్‌ ప్రతివాదులుగా చేర్చటాన్ని తప్పుపట్టింది. "ఉద్దేశపూర్వకంగా వేసినట్లుంది. మీరెవరు" అని ప్రధాన నాయమూర్తి ప్రశ్నించారు.

దీనికి తన పిటిషనరైన సుర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ హిందూసేన ఉపాధ్యక్షుడు అని న్యాయవాది బరూన్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. "ఎందుకు మీ పిటిషన్‌లో ఎంపిక చేసిన పార్టీల పేర్లే ఉన్నాయి. అన్ని పార్టీలను ఉద్దేశించి ఉండాలిగా" అని ధర్మాసనంలో మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న నిలదీశారు. వెంటనే జస్టిస్‌ ఎన్‌.వి.రమణ జోక్యం చేసుకొని "రహస్య ఎజెండా ఉందని అర్థమవుతోంది" అని పిటిషన్‌ను కొట్టివేశారు.

ఇదీ చదవండి: చెన్నై మేయర్​గా ఎస్సీ మహిళ... 340ఏళ్ల చరిత్రలో తొలిసారి..

ABOUT THE AUTHOR

...view details