ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఆయన నివాసంలో శుక్రవారం భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక నుంచి రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టను అని ఇటీవల ప్రశాంత్ కిశోర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
పవార్‌తో భేటీ మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ముగిసింది. అయితే ఈ భేటీపై ప్రశాంత్ కిశోర్, పవార్ స్పందించలేదు.
ఎన్సీపీ నేతల స్పందన..
ఈ సమవేశంపై ఎన్సీపీ నేతలు స్పందించారు. రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టను అని కిశోర్ ఇప్పటికే ప్రకటించారని.. కాబట్టి భేటీకి ప్రాధాన్యం లేదని అని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. అసలు ఈ భేటీపై తనకు ఎలాంటి సమాచారం తెలియదని మరో ఎన్సీపీ నేత ఛగ్గన్ భుజ్బల్ అన్నారు. అయితే కిశోర్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త కావడం వల్ల పవార్ కచ్చితంగా ఆయన సలహాలను తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.
శివసేన నేత సంజయ్ రౌత్ కూడా ఈ విషయంపై స్పందించారు. చాలా మంది నేతలు కిశోర్‌ను సంప్రదిస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి :టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్ రాయ్