Political Celebrities Wishes to CM Revanth Reddy : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా పాలన విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు.
అన్ని విధాలా తోడ్పాటు: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తున్నానన్నారు. ఈ మేరకు మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ బాటలో అన్ని విధాలా అభివృద్ధి చేసి, గొప్ప విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు - సీఎం తొలి సంతకం దానిపైనే!
తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం ఫరిడవిల్లాలి: తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డికిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రంలోని అన్ని పక్షాలను కలుపుకుని వెళ్లాలని సూచించారు. ప్రజల ఆకాంక్షాల మేరకు పని చేయాలని తెలిపారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగించాలని పేర్కొన్నారు.
వెన్నుచూపని వీరుడు, జనాదరణ పొందిన నాయకుడు - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి