జమ్ముకశ్మీర్‌లో పోలీస్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు - ఉగ్రవాదుల కాల్పులు
20:43 November 07
జమ్ముకశ్మీర్‌లో పోలీస్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని బాటమలూ ప్రాంతంలో ఓ కానిస్టేబుల్‌పై(29) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పోలీస్ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
టెర్రరిస్టుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్‌ను స్థానికంగా ఉన్న ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనను నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పార్టీ ఖండించింది. ఉగ్రవాదుల దుశ్చర్యగా అభివర్ణించింది.