Police Theft In Varanasi Case :దెయ్యం దర్యాప్తు కోసం వచ్చిరూ.1.4 కోట్ల దోపిడీ చేసి పరారీలో ఉన్న ఏడుగురు పోలీసులపై ఉత్తర్‌ప్రదేశ్.. వారణాసి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు జడ్జి శక్తి సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్టేషన్ ఇన్ఛార్జ్తో పాటు ముగ్గురు ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే ఈ ఘటనపై వారణాసి జిల్లా భేలూపుర్ పోలీస్ స్టేషన్లో 12 మందిపై కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గతేడాది సెప్టెంబర్‌లో వారణాసి జిల్లాలో దెయ్యం సంచరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తెల్లటి వస్తువులు కదులుతున్నట్లు పలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై వారణాసి జిల్లా భేలూపుర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రమాకాంత్ దుబే.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలపై కేసు కూడా నమోదు చేశామని.. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను కూడా ముమ్మరం చేశామని అప్పట్లో దుబే చెప్పారు.
కట్‌చేస్తే.. 2023 మే 29న దర్యాప్తు కోసం వెళ్లిన రమాకాంత్ దుబే.. గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి కంపెనీ కార్యాలయానికి రెండు వాహనాలతో వెళ్లారు. గన్స్‌తో బెదిరించి.. అందులో పని చేస్తున్న ఉద్యోగి విక్రమ్ సింగ్ వద్ద నుంచి రూ. 1.4 కోట్లు దొంగతన చేశారు. ఈ చోరీలో దూబెకు పోలీసు సహచరులు సుశీల్ కుమార్, ఉత్కర్ష్ చతుర్వేది, మహేశ్ కుమార్ సింగ్, మహేంద్ర కుమార్, శివచంద్ర, కపిల్‌దేవ్ పాండేలతో పాటు ప్రదీప్ పాండే, వసీంఖాన్, ఘన్‌శ్యాం మిశ్ర, సచ్చిదానంద రాయ్ అలియాస్ మంటూ, అజీత్ మిశ్రా సహాయం చేశారు.